రూ.కోట్లు ఆశపెట్టి రూ.70 లక్షలకు టోకరా.. ఇదో నయా సైబర్‌ నేరం

26-07-2019 Fri 11:19 | Andhra
  • వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌ నుంచి ఈమెయిల్‌
  • రూ.2500 కోట్ల ప్రైజ్‌ మనీ వచ్చిందని బురిడీ
  • దఫదఫాలుగా డబ్బు లాగేసిన నేరగాళ్లు
మనిషి అత్యాశకు పోతే ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ ఈ ఘటన. ముక్కుమొహం తెలియని సంస్థ మీకు వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌లో 2500 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చిందని ఆశ చూపించగానే నిజానిజాలు నిర్థారించుకోకుండానే ముందుకు వెళ్లిన ఓ అధికారి అత్యాశ అతన్ని నిలువునా ముంచింది. అతని జీవిత కష్టార్జితం రూ.70 లక్షలు దుండగుల పాలయ్యింది.

విశాఖ సైబర్‌ క్రైం పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన బి.రామకృష్ణకు 2015లో వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌ నుంచి ఓ మెయిల్‌ వచ్చింది. మీరు 250,000,000 బ్రిటన్‌ ఫౌండ్స్‌ (భారత కరెన్సీలో రూ.2500 కోట్లు) గెల్చుకున్నారన్నది దాని సమాచారం. దీంతో ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన రామకృష్ణ తనకు వచ్చిన మెయిల్‌కి సమాధానం ఇచ్చాడు.

అట్నుంచి +448726148738 నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. తన పేరు ఫాస్టర్‌ న్యూమాన్‌ అని, యూకేలోని హెచ్‌ఎస్‌బీసీ  బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానని నమ్మబలికాడు. ప్రైజ్‌ మనీ సదరు సంస్థ తమ బ్యాంకులో జమ చేసిందని, దాన్ని తీసుకునేందుకు యూకేలో బ్యాంక్‌ ఖాతా తెరవాల్సి ఉందని తెలిపాడు. ఇందుకు కొంత సొమ్ము కట్టాలని చెప్పాడు. ఖాతా తెరిచాక ఏటీఎం కార్డు పంపిస్తామని, దాన్ని ఉపయోగించి ప్రైజ్‌మనీ తీసుకోవచ్చని నమ్మబలికాడు.

అదంతా వాస్తవమేనని నమ్మిన  రామకృష్ణ సదరు వ్యక్తి చెప్పిన ఖాతాకు  రూ.34,500లు డిపాజిట్‌ చేశాడు. చెప్పినట్టే ఏటీఎం కార్డు పంపిన కేటుగాళ్లు అది పనిచేయాలంటే ప్రపంచ బ్యాంక్‌కు, యాంటీ టెర్రరిస్టు నిధుల సమీకరణకు, బీమాకు అంటూ  పలుమార్లు నగదు జమ చేయించుకున్నారు. చెప్పినవన్నీ చేసినా ఏటీఎం కార్డు ద్వారా నగదు రాకపోవడంతో రామకృష్ణ,  ఫాస్టర్‌ న్యూమాన్‌ను మళ్లీ సంప్రదించాడు. రామకృష్ణ పూర్తిగా తమ ట్రాప్ లో ఉన్నాడన్న నిర్ధారణకు వచ్చిన దుండగులు  ప్రైజ్‌మనీని తమ ప్రతినిధి కెల్విన్‌ ఫిలిప్స్‌ అప్పగిస్తారంటూ అతన్ని రామకృష్ణ ఇంటికి పంపించారు.

అతడు తన వెంట తెచ్చిన బాక్సులోని కొంత బ్లాక్‌ కోటెడ్‌ కరెన్సీని ఒక ద్రవంలో ముంచి యూకే పౌండ్లుగా మార్చి చూపించాడు. రామకృష్ణను పూర్తిగా నమ్మించాడు. తెచ్చిన ద్రవం అయిపోయిందని, యూకే తిరిగి వెళ్లాక దాన్ని కొరియర్‌లో పంపిస్తానని చెప్పి మరికొంత మొత్తం లాగేశారు. ఈ విధంగా రామకృష్ణ దఫదఫాలుగా వారికి రూ.70 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు విశాఖ సైబర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. సి.ఐ. గోపినాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
saiber crimelotery cheatingvisakhapatnamMVP colonymana loses rs.70lakhs

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more